close
Array ( ) 1

తాజా వార్తలు

చూపు లేని తల్లి.. కాలు లేని తండ్రి

భిక్షమెత్తి వారిని పోషిస్తున్న బాలిక
మూడు నెలలుగా రూ.5 భోజనమే ఆసరా

చూపు లేని తల్లి.. కాలు లేని తండ్రి

మలక్‌పేట, న్యూస్‌టుడే: ఆస్తులు లేవు.. సొంత గూడు లేదు.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మూడు నెలల క్రితం ఓ ప్రమాదంలో కాలు విరిగి మంచానికి పరిమితమయ్యాడు ఓ అభాగ్యుడు.. ఆసుపత్రిలో చూపించుకోడానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. భార్యకు చూపు సరిగా లేదు. ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఉన్న ఒక్క కుమార్తె భిక్షమెత్తి తీసుకొస్తున్న డబ్బులతో రూ.5 భోజనంతో బతకువెళ్లదీస్తున్నారు ఆ విధి వంచితులు.

ఇద్దరున్నారు.. ఒక్కరు మిగిలారు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, లక్ష్మి దంపతులు. రెండు దశాబ్దాల క్రితం నగరానికి వలసవచ్చి మూసారాంబాగ్‌ డివిజన్‌ తీగలగూడలోని గుడిసెలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె మంజుల ఉన్నారు. కొన్నేళ్ల కిందట కుమారుడు రోడ్లపైన తిరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పోలీస్‌ స్టేషన్‌ తెలియదు.. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఇక్కడ వారు ఎవరూ తెలియకపోవడంతో వదిలేసుకున్నట్లు చెబుతున్నారు. మూడు నెలలకు ముందు శ్రీనివాస్‌ భవన నిర్మాణ కార్మికుడిగా, పెట్రోల్‌ బంక్‌లో చిన్నపాటి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అప్పుడు కొంత సంపాదనతో ఎలాంటి కష్టం లేకుండా ఉన్నారు. కానీ పనుల్లో ఉన్న సమయంలో భవనంపై నుంచి పడిపోవడంతో కాలు విరగడంతో ఇంటికి పరిమితమయ్యాడు. భార్య లక్ష్మికి చూపు సరిగా లేకపోవడంతో క్లిష్టమైన పరిస్థితి తలెత్తింది. సొంత గ్రామంలో కూడా ఎలాంటి ఆస్తులు, భూములు, రూపాయి లేక జీవనం కష్టమైంది. ఈ క్రమంలో పన్నెండెళ్ల కుమార్తెకు బాల కార్మికురాలని పనులు ఇవ్వకపోవడంతో ఆమె భిక్షాటన చేస్తోంది.

రూ.5ల భోజనమే కొంత ఆధారం...
ఆయా ప్రాంతాల రోడ్లపై కుమార్తె మంజుల భిక్షాటన చేస్తే రోజుకు రూ.20, 30ల వస్తున్నాయి. మూడు నెలల నుంచి రోజూ రూ.5 భోజనాన్ని తీసుకువచ్చి తల్లిదండ్రులకు పెడుతుంది. ఇది కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉండడంతో రెండు పూటల భోజనం ఒకేసారి తీసుకువచ్చి అందిస్తుంది. ఇలా నిత్యం ఆకలి తీర్చుతూ కుటుంబానికి కొంత అండగా మారింది.

ఎన్నికలప్పుడే గుర్తొచ్చామని ఆవేదన...
ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు శిబిరానికి లక్ష్మి వెళ్లగా ఆధార్‌ కార్డు లేదని పరీక్షలు చేయలేదు. ఓటరు కార్డు ఉండడంతో ఇద్దరినీ ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు కారులో తీసుకువెళ్లి ఓటు మాత్రం వేయించుకున్నారు. మీ వద్దకు మళ్లొస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రాలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. మా కుమార్తె మంజుల తమను భోజనం పెట్టేందుకు ఎన్నో కష్టాలు పడుతుందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీనివాస్‌ కన్నీరుమున్నీరవుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.