గ్లూతో చెలగాటమాడాడు.. ఆస్పత్రి పాలయ్యాడు!
close

తాజా వార్తలు

Updated : 15/02/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్లూతో చెలగాటమాడాడు.. ఆస్పత్రి పాలయ్యాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యంత శక్తిమంతమైన గోరిల్లా గ్లూను ఓ యువకుడు ప్లాస్టిక్‌ కప్‌కి రుద్ది.. దాన్ని పెదాలకు అతికించి తీసేద్దామనుకున్నాడు. కానీ, అది గట్టిగా అతుక్కుపోవడంతో ఆస్పత్రిపాలయ్యాడు. సర్జరీ చేసి అతడి పెదాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవల టెస్సికా బ్రౌన్‌ అనే అమ్మాయి హెయిర్‌స్టైల్‌లో ప్రయోగం చేద్దామని గోరిల్లా గ్లూ స్ప్రేను తలపై చల్లుకుంది. దీంతో జుట్టు అంత తలకు అతుక్కుపోయింది. ఆ గ్లూ ఎంతకీ తొలగకపోవడంతో ఆస్పత్రిపాలైంది. వైద్యులు ఆమె తలపై గ్లూను తీసేశారు. చికిత్స నిమిత్తం టెస్సికాకు 12వేలకుపైగా డాలర్లు ఖర్చయిందట. వైద్య ఖర్చుల కోసం ఆమె నెటిజన్లు ఆర్థికసాయం కూడా కోరింది. అయితే, కొందరు నెటిజన్లు ఆమె అతి చేస్తోందని గ్లూ అంటించుకుంటే వైద్య చికిత్సకు అంత ఖర్చవుతుందా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే లెన్‌ మార్టిన్‌ అనే నెటిజన్‌ టెస్సికా అబద్ధం చెబుతోందని, గ్లూ అంటినా సులభంగా తొలగించుకోవచ్చని నిరూపించాలనుకున్నాడు.

ఇందులో భాగంగా గోరిల్లా గ్లూను ఒక ప్లాస్టిక్‌ కప్‌కు రుద్ది.. దాన్ని పెదాలపై పెట్టుకున్నాడు. దీంతో కప్‌ పెదాలకు అంటుకుపోయింది. పెదాలను, కప్‌ను వేరు చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మార్టిన్‌ కూడా ఆస్పత్రిలో చేరాడు. తను చేసిన ప్రయోగం వీడియో, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోలను మార్టిన్‌ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ‘ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని భావించా. కానీ, బెడిసికొట్టింది. వైద్యులు ఇప్పుడు నా పెదవిని తొలగిస్తారట. నా కోసం దైవాన్ని ప్రార్థించండి’ అని రాసుకొచ్చాడు. మార్టిన చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘అనవసర ప్రయోగాలు ఎందుకు చేస్తారు’, ‘నీవు తెలివి తక్కువ పని చేసి మమ్మల్ని దేవున్ని ప్రార్థించమంటావా?’ అని కామెంట్లు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని