8 పెళ్లిళ్లు.. నిత్యం వేధింపులు
close

తాజా వార్తలు

Updated : 01/04/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

8 పెళ్లిళ్లు.. నిత్యం వేధింపులు

నిందితుడిని అరెస్టు చేయాలంటున్న బాధితులు

జగదాంబ: విశాఖలో 8 మందిని పెళ్లి చేసుకొని వేధిస్తున్న అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటూ బాధిత మహిళలు డిమాండ్‌ చేశారు. వ్యభిచారం చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై గత నెలలోనే కంచరపాలెం పోలీసులను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. అరుణ్‌కుమార్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందని సీపీకి వాయిస్‌ మెసేజ్‌ పంపామని,  అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

దీనిపై బాధితులు మహిళా సంఘాలను కూడా ఆశ్రయించారు. నిందితుడిని అరెస్టు చేయాలని మహిళా చేతన  సంఘం నాయకురాలు పద్మ డిమాండ్‌ చేశారు. నిందితుడు అరుణ్‌కుమార్‌కు గంజాయి, వ్యభిచార ముఠాతో సంబంధాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. తమను తుపాకి, కత్తులతో బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.  

పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ ఆగ్రహం

నిత్యపెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ సీపీని ఆదేశించారు. కేసు నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంపైనా దర్యాప్తు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. 
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని