Viral video: పోలీసు అధికారిపై దాడి
close

తాజా వార్తలు

Published : 08/05/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral video: పోలీసు అధికారిపై దాడి

ముంబయి: కరోనా నిబంధనలు పాటించాలని చెప్పిన ఓ పోలీసు అధికారిపై దాడి జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ సంగంనర్  కూడలి వద్ద సమావేశమైన కొంత మందిని కొవిడ్  నిబంధనలు పాటించాలని ఓ పోలీస్ అధికారి కోరారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. అయితే పోలీసు అధికారి  మాటలను లెక్కచేయని వారు హఠాత్తుగా ఆయనపై దాడికి దిగారు. పిడిగుద్దులు కురిపించారు. దాడిని తప్పించుకునేందుకు పరుగులు పెట్టిన పోలీసును వెంటాడి మరీ కొట్టారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర పోలీసు విభాగం దాడికి పాల్పడిన వారిపై ఎఫ్‌ఐర్‌ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని