సూర్య చిత్రం కూడా ఓటీటీలోనే!
close

తాజా వార్తలు

Updated : 25/08/2020 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్య చిత్రం కూడా ఓటీటీలోనే!

అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్న ‘ఆకాశమే నీ హద్దురా’

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్‌లలో విడుదలకు నోచుకోలేకపోయిన సినిమాలు ఓటీటీల బాటపడుతున్నాయి. ఇప్పటివరకూ చిన్న సినిమాలే ఈ బాటలో పయనించగా, ఇప్పుడు పెద్ద సినిమాలూ ఆ దారిలోనే వెళ్తున్నాయి. ఇటీవల నాని ‘వి’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధం కాగా, ఇప్పుడు తమిళ నటుడు సూర్య కూడా అదే బాటలో పయనించారు.  ఆయన కథానాయకుడిగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సూరారైపోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్‌ నిర్ణయించారు. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాను సెప్టెంబరు 30న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నట్లు సూర్య ప్రకటించారు. 

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘దర్శకులు సుధ ఈ కథ చెప్పిన వెంటనే 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లోనే సినిమా చేయాలని అనుకున్నాం. గోపీనాథ్‌ పాత్ర నాకు ఒక సవాల్‌గా అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ వేదికగా విడుదల చేయడమే మంచిదని భావిస్తున్నాం. నా అభిమానులతో పాటు, ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.

అపర్ణా బాల మురళి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, జాకీ ష్రాఫ్‌, పరేశ్‌రావల్‌, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని