
తాజా వార్తలు
ఎయిర్‌పోర్టులో అబు ఫజల్ అరెస్టు
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన అబు ఫజల్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన అబు ఫజల్ కరోనా ప్రారంభ సమయంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశాడు. అప్పట్లో అతనిపై హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు లుక్అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. అప్పటి నుంచి దుబాయ్‌లో తలదాచుకున్న నిందితుడు ఇవాళ హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి
Tags :