‘దుర్గ గుడి ఈవోవి తీవ్ర ఆర్థిక తప్పిదాలు’ 
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దుర్గ గుడి ఈవోవి తీవ్ర ఆర్థిక తప్పిదాలు’ 

రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక

ఇంద్రకీలాద్రి: విజయవాడ దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తేల్చింది. దుర్గగుడి కార్యకలాపాలపై ఇటీవల సోదాలు నిర్వహించిన ఏసీబీ.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో పాటు ఆడిట్‌ అభ్యంతరాలను బేఖాతరు చేసి ఈవో చెల్లింపులు చేసినట్లు స్పష్టం చేసింది. 

టెండర్లు, కొటేషన్లు, సామగ్రి కొనుగోళ్లలో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇచ్చిన సర్క్యులర్‌కు విరుద్ధంగా ఈవో చెల్లింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. శానిటరీ టెండర్లను నిబంధలనకు విరుద్ధంగా కేఎల్‌ టెక్నాలజీస్‌కు కట్టబెట్టారని.. ఇది సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ విషయంలో తక్కువ సొమ్ముకు కోట్‌ చేసిన స్పార్క్‌ సంస్థను పక్కన పెట్టారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని