కూలీలపై మృత్యు పంజా
close

తాజా వార్తలు

Published : 19/03/2021 08:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూలీలపై మృత్యు పంజా

ఆత్మకూరు: వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్‌ వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కటాక్షపూర్‌ మూలమలుపు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను తుపాన్‌ వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని