close
Array ( ) 1

తాజా వార్తలు

లాక్‌డౌన్‌ వేళ..కానిస్టేబుల్‌నే ఢీకొట్టాడు

విజయవాడ: 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా వాహనచోదకులు ఆగడం లేదు. నగరంలోని రామవరప్పాడు వద్ద ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను క్వాలిస్‌ వాహనం డీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా నగరంలో 144 సెక్షన్‌ విధించారు. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద  ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌ వాహనాలను నియంత్రిస్తున్న సమయంలో ఓ క్వాలిస్‌ వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్‌ తలకు గాయలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది మరో వాహనంలో అతన్ని ఆసుపత్రికి తరలించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.