ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Published : 16/03/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి మృతి

చౌటుప్పల్‌ గ్రామీణం: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌కు చెందిన మణికంఠ దివిస్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. రోజూ లాగే ఈ ఉదయం కూడా బైకుపై విధులకు బయలుదేరాడు. అదే సమయంలో అంకిరెడ్డిగూడెంకు చెందిన సుజీత్‌రెడ్డి తన స్నేహితుడితో కలిసి చౌటుప్పల్‌ వైపు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ శివారుకు చేరుకోగానే ఎదురెదురుగా వచ్చిన బైకులు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన సుజీత్‌ అతని స్నేహితుడిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సుజీత్‌ మరణించాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్‌ ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని