నెల్లూరులో ట్రాక్టర్‌ బోల్తా..ఐదుగురి దుర్మరణం
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరులో ట్రాక్టర్‌ బోల్తా..ఐదుగురి దుర్మరణం

నెల్లూరు రూరల్‌: ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఐదుగురు మృతిచెందిన ఘటన నెల్లూరు మండలం సజ్జాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన కృష్ణవేణి(26), హరిబాబు(43), లక్ష్మీకాంతమ్మ(45), పెంచలయ్య(60), వెంకటరమణమ్మ(19) పుచ్చకాయలు కోసే పనికి ట్రాక్టర్‌పై వెళుతుండగా అదుపుతప్పిన వాహనం రహదారి పక్కనే ఉన్న చేపల చెరువులో బోల్తా పడింది. దీంతో ఈ ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని