ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో.. ఒకరి మృతి
close

తాజా వార్తలు

Published : 14/04/2021 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో.. ఒకరి మృతి

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లపాలెం వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వైపు వెళుతున్న ట్రాక్టర్‌ను కూలీలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 9 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఆటోలో 15 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఆటోను పక్కకి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని