వ్యాను డోరు తెరుచుకుని ఇద్దరు మృతి
close

తాజా వార్తలు

Updated : 24/02/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాను డోరు తెరుచుకుని ఇద్దరు మృతి

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం అర్జాపురం గ్రామానికి చెందిన 25 మంది వలస కూలీలు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మిరప పొలాల్లో పని చేయడానికి బొలేరో వాహనంలో బయల్దేరారు. ఈ క్రమంలో నారాయణపురం వద్దకు రాగానే వాహనం వెనుకడోరు తెరుచుకుంది. దీంతో డోరుకు ఆనుకొని కూర్చుని ఉన్న ఆరుగురు వ్యక్తులు వాహనం నుంచి కిందపడ్డారు. 

కిందపడిన వారిలో రాజా తాతలు, ఎర్రంశెట్టి నూకరాజు  అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను, క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని