
తాజా వార్తలు
మీకేం తెలుసని నన్ను తిడుతున్నారు?: అనసూయ
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల వేదికగా తనపై అసభ్య కామెంట్లు చేసిన వారికి ఘాటుగానే సమాధానమిస్తుంటారు నటి, బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ. తన గురించి చులకనగా మాట్లాడేవారిని సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు బ్లాక్ చేసేస్తుంటారు ఈ నటి. తాజాగా ట్విటర్ వేదికగా తన గురించి నెగెటివ్‌గా కామెంట్ చేసిన ఓ నెటిజన్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్ల క్రితం అనసూయ ఓ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈవెంట్ షూట్ జరుగుతున్న సమయంలో ఆమె అనుకోకుండా కళ్లు తిరిగి పడిపోయారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆదిత్య అనే నెటిజన్ ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘ప్రచారం కోసమే అనసూయ అలా కళ్లు తిరిగిపడిపోయినట్లు యాక్టింగ్ చేశారు’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఆమె గురించి అసభ్యంగా మాట్లాడాడు. సదరు నెటిజన్ చేసిన కామెంట్ చూసిన అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కామెంట్ చేయడం చాలా తేలిక. నాకు లోబీపీ ఉంది. 22 గంటలపాటు నిర్విరామంగా షూట్లో పాల్గొన్న సమయంలో తెల్లవారుజామున 5.30 గంటలకు నేను కళ్లు తిరిగిపడిపోయాను. దానిని మీరు వేరేలా అర్థం చేసుకుంటున్నారు. ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండానే నాపై ఎలా కామెంట్ చేస్తావు మిస్టర్ ఆదిత్య? నన్ను అసభ్యంగా ధూషించాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం వీడియో చూసి ఇలా కామెంట్ చేస్తున్నావా? నిన్ను కూడా అసభ్యంగా ధూషించడానికి నాకు ఎలాంటి సిగ్గు, భయం లేదు. కానీ నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు’ అని అనసూయ సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి