కృష్ణపట్నంలో వందశాతం పెట్టుబడులు అదానీవే!
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణపట్నంలో వందశాతం పెట్టుబడులు అదానీవే!

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు పూర్తి యాజమాన్య హక్కులను అదానీ పోర్ట్స్‌ సంస్థ దక్కించుకుంది. పోర్టులో పెట్టుబడుల్ని అదానీ గ్రూప్‌ వందశాతానికి పెంచుకుంది. 2020లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన ఈ సంస్థ..తాజాగా విశ్వసముద్ర హోల్డింగ్స్‌ నుంచి మరో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 25శాతం వాటా విలువ రూ.2,800 కోట్లుగా తెలిపింది. 

దీంతో కృష్ణపట్నం పోర్టు యాజమాన్య హక్కులు అదానీ పోర్ట్సుకు వందశాతం బదిలీ కానున్నాయి. 2020-21లో పోర్టు మొత్తం విలువ రూ.13,675 కోట్లు ఉన్నట్లుగా అదానీ పోర్ట్సు వెల్లడించింది. ప్రస్తుత హ్యాండిలింగ్‌ సామర్థ్యం 64 మిలియన్‌ టన్నులుగా ఉందని.. 2025 నాటికి దీనిని 200 నుంచి 300 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తామని సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ పోర్టును గేట్‌వే ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని చెప్పుకొచ్చింది.

కృష్ణపట్నం పోర్ట్‌ ఒక డీప్‌ వాటర్‌ నౌకాశ్రయం. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు  3.8 కోట్ల టన్నుల సరకు రవాణా చేసి రూ.1,840 కోట్ల ఆదాయాన్ని, రూ.1,325 కోట్ల నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా కృష్ణపట్నం పోర్టును కొన్నట్లు అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ పేర్కొన్నారు. ఈ పోర్టు సామర్థ్యాన్ని 50 కోట్ల టన్నులకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ ఇటీవలే గంగవరం పోర్టులో సైతం మెజారిటీ వాటాదారుగా మారిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని