యూపీ విభజనపై యోగి కీలక వ్యాఖ్యలు!
close

తాజా వార్తలు

Published : 26/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీ విభజనపై యోగి కీలక వ్యాఖ్యలు!

లఖ్‌నవూ: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ విభజనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని, విభజన కంటే కలిసి ఉండడాన్నే తమ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ప్రభుత్వం 2011లోనే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బుందేల్‌ఖండ్‌, పూర్వాంచల్, అవద్‌ ప్రదేశ్‌, హరితప్రదేశ్‌గా విభజించాలని అప్పటి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే, తాజాగా ఓ సమావేశంలో రాష్ట్ర విభజనపై యూపీ ముఖ్యమంత్రిని అడిగిన ప్రశ్నకు.. ‘తమకున్న చరిత్రపై ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఎంతో గర్వపడుతారు. రాష్ట్రానికి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఐక్యంగా ఉండడాన్నే మేము విశ్వసిస్తాం, విజభనను కాదు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

‘జై శ్రీరాం’ నినాదంపై ఒత్తిడి చేయం..
జై శ్రీరాం నినాదాల గురించి చెడుగా భావించడానికి ఏమీ లేదని..అయితే ఈ నినాదాలు చేయాలని ఎవరిపైనా ఒత్తిడి చేయమని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి  స్పష్టంచేశారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జై శ్రీరాం నినాదాలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి చేసిన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు.

ఇవీ చదవండి..
భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా
కొవిడ్‌ టీకా: పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు తప్పవ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని