
తాజా వార్తలు
బిగ్‌బీకి వీరాభిమానిని: గీతా గోపినాథ్
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) అందర్నీ అలరిస్తోంది. ప్రస్తుతం 13వ సీజన్ శుక్రవారంతో ముగియనుంది. కాగా, ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కేబీసీ గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్‌ను పంచుకున్నారు. 35 సెకన్ల వీడియోను పోస్ట్ చేసి.. తాను అమితాబ్‌కు వీరాభిమాని అని అంటూ ట్వీట్ చేశారు.
ఈ వీడియోలో హాట్సీట్లో కూర్చున్న వ్యక్తిని అమితాబ్ ఓ ప్రశ్న అడిగారు. 2019 నుంచి ఐఎమ్ఎఫ్ ఆర్థికవేత్తగా ఉన్న ఈ ఫొటోలో వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించారు. కాగా, ఆ ఫొటో గీతా గోపీనాథ్‌ది. ఫేవరెట్ హీరో బిగ్‌బీ తన గురించి ప్రస్తావించడంతో ఆనందంతో ఆమె ట్విటర్లో పంచుకున్నారు. కోల్‌కతాలో జన్మించిన గీతా ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన విషయం తెలిసిందే.
‘అమితాబ్ బచ్చన్‌కు అభిమాని అయిన నేను ఇలాంటి సందర్భం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది ఎప్పటికీ ప్రత్యేకమే’ - ట్విటర్లో గీతా గోపీనాథ్