close

తాజా వార్తలు

Published : 10/04/2021 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నికల వేళ బయటపడ్డ 200 బాంబులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 4వ విడత పోలింగ్‌ జరుగుతున్న వేళ సుమారు 200 బాంబులు బయటపడటం కలకలం రేపింది. నానూర్‌ గ్రామంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లో దాదాపు 200 బాంబులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) బీర్బం జిల్లా అధ్యక్షుడు అనుబ్రాతా మోండల్‌ స్వగ్రామం నానూర్‌ కావడంతో భాజపా ఆరోపణలు గుప్పించింది.

నానూర్‌లో బాంబులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టామని.. ఇందులో 200 బాంబులు, బాంబు తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బాంబులను సీఐడీ బాంబ్‌ స్క్వాడ్‌ ఖాళీ ప్రదేశంలో నిర్వీర్యం చేసింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని