
తాజా వార్తలు
ఈమె పాక్ ‘ఐష్’!
ఇంటర్నెట్‌డెస్క్: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని ఎన్నో సందర్భాల్లో వింటుంటాం. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. పాకిస్థాన్‌కు చెందిన ఆమ్నా ఇమ్రాన్ అనే యువతి అచ్చంగా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్లా కనిపిస్తూ అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. 2017లో ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన ఆమ్నా.. తన ఫొటోలను తరచూ నెట్టింట్లో పంచుకొనేది.
ఆమ్నా షేర్ చేసిన ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు.. అచ్చంగా ఐశ్వర్యరాయ్‌లా ఉన్నావంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మరికొంతమంది మాత్రం ‘ఐశ్వర్యలా కనిపించడం కోసం సర్జరీ చేయించుకున్నట్లు ఉంది’ అని కామెంట్లు చేశారు. నెటిజన్ల కామెంట్లపై స్పందించిన ఆమె.. తాను ఎన్నడూ శస్త్రచికిత్సల జోలికి పోలేదని.. ఐశ్వర్యలా కనిపించడం తన అదృష్టమని ఓ సందర్భంలో అంది. ఈ క్రమంలోనే ఇటీవల ఐశ్వర్య లుక్స్‌ను రీక్రియేట్ చేస్తూ పలు ఫొటోషూట్లకు సైతం ఆమ్నా పోజులిచ్చింది. తాజాగా ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరూ ఆమ్నాను చూసి.. పాకిస్థాన్‌లో అందాల సుందరి ఐశ్వర్య అని పోస్టులు పెడుతున్నారు.