ఇవాళ రాహుల్‌.. రేపు ఇషాన్‌.. తర్వాత పంత్‌ 
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇవాళ రాహుల్‌.. రేపు ఇషాన్‌.. తర్వాత పంత్‌ 

ఇలా అయితే టీమ్‌ఇండియాను రూపొందించేదెలా : చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన (1, 0) కేఎల్‌ రాహుల్‌పై విమర్శలు చేయడం తగదని మాజీ ఓపెనర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్‌ చేసినంత మాత్రాన మ్యాచ్‌ విన్నర్‌ను ప్రశ్నించడం సరికాదన్నాడు. రాహుల్‌ గత రెండు టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మూడో టీ20లో అతడు తుది జట్టులో ఉంటాడా? లేదా? అని పేర్కొంటూ ఓ క్రీడా ఛానల్‌ ట్వీట్‌ చేసింది.

ఇది చూసిన ఆకాశ్‌ చోప్రా‌ దీటుగా బదులిచ్చాడు. ‘ఒక మ్యాచ్‌ విన్నర్‌లాంటి ఆటగాడిపై.. కేవలం రెండు వరుస వైఫల్యాలు చూసి ప్రశ్నలు గుప్పిస్తే.. అప్పుడు మనం టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించే జట్టును రూపొందించలేం. ఇవాళ రాహుల్‌ సరిగ్గా ఆడకపోతే రేపు ఇషాన్‌ ఆడడు.. తర్వాత పంత్‌ ఆడలేడు. అలా మార్చుకుంటూ పోతే జట్టులో తమ స్థానాలపై నమ్మకం లేని ఆటగాళ్లతో టీమ్‌ఇండియాను కలిగి ఉంటాం’ అని చోప్రా రీట్వీట్‌ చేశాడు. కాగా, రాహుల్‌ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలిసిందే. టాప్‌ఆర్డర్‌ నుంచి మిడిల్‌ ఆర్డర్‌ వరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. జట్టుకు అవసరమైన వేళ వికెట్‌ కీపింగ్‌ కూడా చేయగలడు. మరోవైపు ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని