
తాజా వార్తలు
ఆమె గణితంలో.. రికార్డులు సృష్టిస్తోంది!
ఇంటర్నెట్ డెస్క్: గణితం పేరు వింటేనే చాలా మందికి భయం వేస్తుంది. ఎలక్ర్టానిక్ పరికరాల వినియోగం పెరిగాక చిన్నచిన్న లెక్కలు కూడా సొంతంగా చేయలేకపోతున్నాం. కనీసం ఇద్దరు, ముగ్గురి ఫోన్ నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడకు చెందిన విద్యార్థిని మాత్రం గణిత శాస్ర్తంలో అద్భతాలు సృష్టిస్తోంది. ఒకటి, రెండు కాదు వేల అంకెలు గల సంఖ్యలను కూడా ఇట్టే చెప్పేస్తూ ప్రపంచ రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటోంది.
విజయవాడకు చెందిన అక్షర ‘రూట్ 2’ విలువను అతి తక్కువ సమయంలో చెప్పింది. ‘రూట్ 2’ కు సంబంధించి అనంతమైన విలువలో అత్యంత వేగంగా 6020 డెసిమల్స్ చెప్పి సరికొత్త రికార్డు సృష్టించింది వేమూరి సాయి అక్షర. ఆమె పదో తరగతి చదువుతోంది. క్రీడలు, క్విజ్, శాస్ర్త విజ్ఞానం, సేవా కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటోంది. గణితంలో ‘రూట్ 2’ విలువ అంటే సాధారణంగా 1.414 అని చెబుతుంటాం. కానీ ‘రూట్ 2’ విలువ అనంతమైంది. ఆ విలువలోని 6020 డెసిమల్స్ను కేవలం 5.12 నిమిషాల్లో చెప్పి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అప్పటి వరకు ఉన్న రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కరోనా కారణంగా వర్చువల్‌గా నిర్వహించిన ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ చూపింది అక్షర.
అంతకు ముందే రూట్ 2 కు సంబంధించి 500 డెసిమల్స్, 1200 డెసిమల్స్ చెప్పి రికార్డులు సృష్టించింది. దీంతో ఆమెకు ఛాంపియన్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్, ఓఎంజీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అమేజింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి అవార్డులు వచ్చాయి. గణితంతో పాటు శాస్ర్త విజ్ఞానంలోనూ అక్షర రాణిస్తోంది. ఐఐటీ ఖరగ్‌పుర్ ఇంటర్నేషనల్ యంగ్ ఇన్నోవేటర్ 2019లో ఆమె ప్రదర్శించిన స్మార్ట్ హెల్మెట్ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2018 పోటీల్లోనూ అవార్డులు గెలుచుకుంది. ఆటపాటల్లోనూ ఆమె అనేక అవార్డులు గెలుచుకుంది. సంగీతంలో ప్రతిభ కనబరుస్తోంది. ఆర్చరీ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. పేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంలో అక్షర వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చిన్న వయసులోనే అక్షర ప్రతిభ చాటడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. ఇష్టంతో ఏ రంగంలో అడుగుపెట్టినా ఆమెకు తోడుగా ఉంటున్నారు. దీంతో అక్షర మరింత వేగంగా రూట్ 2 విలువను మరోసారి చెప్పి తన రికార్డు తనే బద్దలు కొట్టేందుకు సన్నద్ధమవుతోంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
