close

తాజా వార్తలు

Published : 27/01/2021 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భావితరాలకు ఆ యోధుల కృషి తెలియాలని..

క్యాలండర్‌లో సాహితీవేత్తల పరిచయం

కర్నూలు: భాష, సాహిత్య రంగాల్లో కృషి చేసిన ఎందరో ప్రముఖుల గురించి నేటి తరానికి దాదాపుగా తెలిసి ఉండదు. అందుకే కర్నూలు జిల్లాలో భాషా వికాసానికి కృషి చేసిన పలువురి గురించి తెలియజేసేందుకు పెరికల రంగస్వామి అనే వ్యక్తి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. క్యాలెండర్‌ రూపొందించి దాని ద్వారా అలనాటి సాహితీవేత్తలను పరిచయం చేసి భాషాభిమానాన్ని చాటుకున్నారు. డీటీపీ సెంటర్‌ నిర్వహిస్తున్న రంగస్వామి ‘అక్షర యోధులు’ పేరిట కొత్త ఏడాది క్యాలెండర్‌ రూపొందించి.. తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేసిన జిల్లాకు చెందిన 12 మంది ప్రముఖులకు అందులో స్థానం కల్పించారు.

ఆంగ్లంలో అష్టావధానం చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అందలం కృష్ణమూర్తి, బాల సాహిత్యంలో విశేష కృషిచేసిన చంద్రప్రభావతమ్మ దంపతులిద్దరూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు సాధించారు. కాగా వారిద్దరికీ ఈ క్యాలెండర్‌లో ప్రత్యేక స్థానం కల్పించారు. జిల్లాలో చాలా మందికి సాహిత్య రంగంలో ప్రవేశం ఉంది. మహాత్మా గాంధీని పత్తికొండకు తీసుకొచ్చిన వనం శంకరశర్మ ఎన్నో నాటకాలను రచించారు. స్వాతంత్ర్య పోరాటం కోసం పత్రికలను నడిపారు. తాటిమాను నారాయణరెడ్డి భగవద్గీతను పద్యంలోకి తీసుకొచ్చారు. నాగప్పగారి సుందరరాజు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించారు. శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పింగళి సూరన, పద్య కావ్య రచనలో తిరుగులేని కవిరాజుగా గుర్తింపు పొందిన కలుగొట్ల విజయాత్రేయుల గురించి కాలమానిలో వివరించారు.

మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, పండిత హీరాలాల్‌, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, షేక్‌ దావూద్‌, వీర బలవంతప్ప, ధరణి రామచంద్రరావుల వీరోచిత పోరాటాల గురించి కాలమానిలో వెల్లడించారు. కవులు, కళాకారులను భావితరాలకు పరిచయం చేసేందుకే ఈ కాలమానిని రూపొందించినట్లు రంగస్వామి తెలిపారు. ఇలాంటి క్యాలెండర్‌ రావడం సాహిత్య చరిత్రలో ఇదే ప్రథమమని.. పాతకాలపు కవులు, కళాకారులను భావితరాలకు పరిచయం చేయాలనే ఆలోచన రావడమే అద్భుతమని కవులు, మేధావులు కొనియాడుతున్నారు.

ఇవీ చదవండి...

నాలుగు భాషలు.. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్‌లో..

పట్టుదలే పెట్టుబడిగా.. వైకల్యాన్ని అధిగమిస్తూ..
 




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని