దిల్లీలో 15 రోజులు లాక్‌డౌన్‌ విధించాలి
close

తాజా వార్తలు

Published : 18/04/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో 15 రోజులు లాక్‌డౌన్‌ విధించాలి

సీఏఐటీ డిమాండ్‌

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కరోనా ముప్పు తీవ్రంగా పొంచి ఉందని.. లాక్‌డౌన్‌ విధించాలంటూ ఆలిండియా ట్రేడర్స్‌ ఫెడరేషన్‌(సీఏఐటీ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆదివారం లేఖ రాసింది. ‘దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దిల్లీలోనూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దిల్లీ పౌరుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని కరోనా ముప్పును నివారించేందుకు లాక్‌డౌన్‌ విధించాలి. తక్షణమే 15 రోజుల పాటు దిల్లీలో లాక్‌డౌన్‌ అమలు చేయాలి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు సహా దిల్లీ సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. బయటి ప్రాంతాల నుంచి కొవిడ్‌ సోకిన వ్యక్తులు ఎవ్వరూ దిల్లీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో డిమాండ్‌ చేసినట్లు ఆలిండియా ట్రేడర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. కాగా, దిల్లీలో గడిచిన 24 గంటల్లో 24,375 కేసులు నమోదు కాగా, 167 మంది మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని