ఏపీలో పురపోరుకు సర్వం సిద్ధం
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో పురపోరుకు సర్వం సిద్ధం

అమరావతి: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 78,71,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీల్లోని 1634 వార్డుల్లో పోలింగ్‌ జరగనుంది. 

12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 7552 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్‌ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సామగ్రిని ఇప్పటికే దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాలకే చేరవేశారు. ఈనెల 14న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని