close

తాజా వార్తలు

Published : 02/03/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టార్‌నైనా కష్టాలు ఎదుర్కొన్నా: అమలాపాల్‌

విడాకుల గురించి స్పందించిన నటి

చెన్నై: ‘‘సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ని అయినప్పటికీ ఒకానొక సమయంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను’’ అని నటి అమలాపాల్‌ తెలిపారు. కోలీవుడ్‌ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌ని 2014లో ప్రేమ వివాహం చేసుకున్న అమలా.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2017లో ఆయన నుంచి విడిపోయారు. ఈ క్రమంలోనే ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. హిందీలో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ‘లస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌ను తెలుగులో ‘పిట్టకథలు’గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ‘పిట్టకథలు’ ప్రమోషన్‌లో పాల్గొన్న అమలాపాల్‌ తన భర్త విజయ్‌ నుంచి విడిపోవడం గురించి స్పందించారు. విడాకులు తీసుకున్న సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పెదవివిప్పారు.

‘‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. పరస్పర అంగీకారంతోనే మేము విడాకులు తీసుకున్నాం. అయితే, విజయ్‌ నుంచి విడాకులు తీసుకున్న సమయంలో నాకెవరూ అండగా నిలబడలేదు. అందరూ నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు. నా మానసిక ఆరోగ్యం, సంతోషం గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఓ సక్సెస్‌ఫుల్‌ నటిని అయినప్పటికీ నేను కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది.’’ అని అమలాపాల్‌ వివరించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని