close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024509 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => _yanwyTtvQs [video_short_link] => _yanwyTtvQs [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-02-20 20:26:56.335379 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

సిద్దిపేట అమరనాథుడిని దర్శించుకుందామా!

‘మంచు పర్వతాల్లో శివుడు’ అంటే మనకు గుర్తొచ్చేది అమర్‌నాథుడు. జమ్మూ- కశ్మీర్‌లో ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని పవిత్రంగా భావించే భక్తులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. వేసవిలో తప్ప మిగతా సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు.. వేల సంఖ్యలో భక్తుల దర్శనాలు.. కొండలు ఎక్కి అమర్‌నాథుడి గుహను చేరుకునే సాహసాలు.. మంచు రూపంలో శివుని అందాలు. .ఇలా ఎన్నో వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.

ఇంతటి వైవిధ్యం ఉన్న ఈ యాత్రలో పాల్గొనడం కాస్త క్లిష్టమైన పనే. అందుకే కేవలం కొంతమంది భక్తులకి మాత్రమే మంచులింగాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. కానీ, అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనలేని భక్తులకు సైతం దర్శనం కలిగించేలా సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి మహాశివరాత్రి సందర్భంగా విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన భక్తుల కోసం ధార్మిక ఉత్సవ సమితిని భక్తులు ఏర్పాటు చేశారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కళాకారులతో మంచుకొండలు, గుహవంటి భారీ సెట్టింగ్‌లు నిర్మించారు. ఇందులో అమర్‌నాథ్‌ మంచులింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

‘‘సిద్దిపేటలో నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవంలో అమర్‌నాథ మహాలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాని ఏర్పాటు చేశారు. బిల్వ పత్రార్చన, మహాభిషేకంలో పాల్గొనే అవకాశం ఉత్సవ కమిటీ కల్పించడం మహాదానందదాయకం.  ప్రజల్లో చైతన్యం, భక్తిభావాన్ని ఉత్తేజితం చేసే అవకాశం లభిస్తుంది.’’ అని పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి తెలిపారు.

అమర్‌నాథ్‌ యాత్రలో వచ్చే పహల్‌గామ్, చందన్‌వడీ, శేష్‌నాథ్‌, పంచర్‌తరిణి వంటి ప్రదేశాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల విశిష్టత తెలిసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంచు శివలింగాన్ని తయారు చేశారు. వీటితో పాటు దేశం నలమూలలా విస్తరించి ఉన్న ద్వాదశ జ్యోతిర్లిలింగాల నమూనా సైతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో శివుడికి నిరంతం బిల్వార్చన, అభిషేకాలతో పాటు లక్ష పుష్ఫార్చన, శివపార్వతుల కల్యాణం, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రతి భక్తునికి మహాప్రసాదంతో పాటు కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్ష, రక్షాకంకణం, ఐశ్వరా కాయిన్‌ ఉచితంగా అందించనున్నారు. జాగరణకు సైతం ఏర్పాట్లు చేశారు. పండుగ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివతత్వం శివరాత్రి విశిష్టతలు వివరించేలా 400 కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మహాశివరాత్రి రోజున అమరనాథుడి దర్శనం కావాలంటే సిద్దిపేటకు వెళ్లాల్సిందే మరి!



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.