close

తాజా వార్తలు

Updated : 27/02/2021 04:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!

బలమైన సందేశాన్ని ట్వీట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా

దిల్లీ: ‘దిస్‌ ఈస్‌ ద పవర్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ అంటూ ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా గురువారం బర్నింగ్‌ మాన్‌ అనే కార్యక్రమానికి సంబంధించిన ఒక కళాకృతి ఫొటోను షేర్‌ చేస్తూ.. మానవుల లోపాలను ఇది స్పష్టంగా చూపుతోందని అన్నారు. ఆ ఫొటోలో ఇద్దరు యువతీయువకులు వ్యతిరేక దిశలో కూర్చొని ఉండగా వారిలో ఉన్న చిన్నారులు మాత్రం ఒకరితో ఒకరు కలవాలని చూస్తున్నట్లు ఉంది.

‘‘ఏదేమైనా ఇద్దరిలో ఉన్న చిన్నారులు ఒకరితో ఒకరు కలవాలనుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మనం అనేక బహుమతులు పొందుతాం. అలాగే అహంకారాన్ని, కోపాన్ని పెంచుకుంటూ పోతున్నాం.  కానీ, మనకు నిజమైన బహుమతి ఏంటంటే.. ఎవరితోనూ విభేదాలు లేకుండా ఉండటం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకుండే స్వభావం క్షమాగుణం, స్వేచ్ఛా స్ఫూర్తి. అదే మన అసలైన స్వభావం. మీరు మొండిగా ఉండాలని అనుకున్నపుడు ఈ విషయాన్ని గుర్తుచేసుకోండి. ’’ అని ఆ ఫొటోపై రాసుంది. జీవిత సత్యానికి సంబంధించి ఆనంద్‌ మహీంద్రా చేసిన ఈ పోస్టు భావోద్వేగభరితంగా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని