మద్యాన్ని ఇలా కూడా తరలించొచ్చా..!
close

తాజా వార్తలు

Published : 20/03/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్యాన్ని ఇలా కూడా తరలించొచ్చా..!

ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్లు ఆకట్టుకునేలా, ప్రత్యేకంగా ఉంటాయి. అయితే తాజాగా ఆయన షేర్ చేసిన ట్విటర్ వీడియో మాత్రం కాస్త ఆశ్చర్యపరుస్తోంది. ఒక పికప్‌ ట్రక్కులో కింద బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ ఐడియాను మహీంద్రా తప్పుబడుతూ.. తమ పికప్‌ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని.. భవిష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు.

‘భయంకరమైన తెలివైనవాడు. సరుకు రవాణాకు కొత్త అర్థం ఇచ్చాడు! మా పరిశోధనా కేంద్రంలో పికప్‌ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు. ఎప్పటికీ ఉండదు’ అంటూ దాన్ని ఉపయోగించిన తీరును మహీంద్రా ఖండించారు. అయితే ఆ ట్రక్కు, అందులోని మందు బాటిళ్లను సీజ్ చేసిన ప్రాంతం వివరాలపై మాత్రం స్పష్టత లేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని