అంతకు నాలుగురెట్లు ఆత్రుత
close

తాజా వార్తలు

Published : 18/02/2021 16:28 IST

అంతకు నాలుగురెట్లు ఆత్రుత

ముంబయి: ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘పతి పత్నీ ఔర్‌ ఓ’ ‘కాలీ పీలీ’ చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయిక అనన్యా పాండే. ఇప్పుడు ఈ భామ పాన్‌ ఇండియా నాయికగా మారి చేస్తున్న చిత్రం ‘లైగర్‌’. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. పాన్‌ ఇండియా చిత్రంలో నటించడంపై అన్యన్య స్పందించింది. ‘‘రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ‘లైగర్‌’తో మరో నాలుగు భాషల్లోకి ఒకేసారి వెళ్లే అవకాశం దక్కింది. బాలీవుడ్‌ ఎంట్రీ కంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఆత్రుతగా ఉంది. ఇప్పుడు హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీ వేదికలు వచ్చాకా అన్ని భాషల్లోని చిత్రాలకు మంచి అవకాశం దక్కింది. ఒకేసారి ఇన్ని భాషల ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను’’అని చెప్పింది. ‘లైగర్‌’తో పాటు శకున్‌ బత్రా దర్శకత్వంలో దీపికా పదుకొణె, సిద్ధాంత్‌ చతుర్వేది ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది అనన్య.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని