
తాజా వార్తలు
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అనసూయ
ఉత్కంఠగా ‘థ్యాంక్ యు బ్రదర్’ ట్రైలర్
హైదరాబాద్: ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాతగా అలరిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న నటి అనసూయ. విరాజ్ అశ్విన్‌తో కలిసి ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేశ్ రాపర్తి దర్శకుడు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు వెంకటేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో డైరెక్టర్ రమేశ్ సినిమాను తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే ఆసక్తిగా ఉందన్నారు.
బహుళ అంతస్తుల భవనంలో నివసించే ప్రియ(అనసూయ) నిండు గర్భిణి. ఒక రోజు లిఫ్ట్‌లో కిందకు వెళ్తుండగా సడెన్‌గా షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. అదే లిఫ్ట్‌లో ఓ యువకుడు(విరాజ్) కూడా ఉంటాడు. అప్పుడే ప్రియకు నొప్పులు మొదలవుతాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? లిఫ్ట్ కదిలిందా? తెలియాలంటే ‘థ్యాంక్ యు బ్రదర్’ చూడాల్సిందే. ఉత్కంఠగా సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్రెడ్డిలు నిర్మిస్తున్నారు. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూరుస్తున్నారు.
ఇవీ చదవండి..