close

తాజా వార్తలు

Published : 20/02/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సారీ చెప్పినా సరే.. అనసూయ కౌంటర్‌

నెటిజన్‌ కామెంట్‌కు నటి రిప్లై

హైదరాబాద్‌: తాను షేర్‌ చేసిన ఫొటోలు, అభిప్రాయాలపై ఎవరైనా కామెంట్లు చేస్తే నటి అనసూయ వాళ్లపై కౌంటర్‌ ఎటాక్‌ చేస్తుంటారు. అలా ట్విటర్‌, ఇన్‌స్టా వేదికగా ఎన్నో సందర్భాల్లో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ నెటిజన్‌పై మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. నెటిజన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె మాత్రం కౌంటర్‌ సమాధానమిచ్చారు. ఇంతకీ ఆమె కోపానికి గురి కావడానికి కారణమేమిటంటే..

నటిగా, యాంకర్‌గా, అప్పుడప్పుడూ స్పెషల్‌సాంగ్స్‌లో తళుక్కున మెరిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్న అనసూయ తరచూ తన స్టైలిష్‌ ఫొటోషూట్స్‌ని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల లంగావోణిలో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ఆమె షేర్‌ చేసిన వాటిల్లో ఓ ఫొటో గురించి తాజాగా ఓ నెటిజన్‌ స్పందించాడు. ‘అ ఆ’ సినిమాలోని సమంతతో అనసూయ ఫొటోని పోలుస్తూ.. ‘నువ్వు ఏమైనా సమంత అనుకుంటున్నావా?’ అంటూ ఓ మీమ్‌ క్రియేట్‌ చేశాడు. అది చూసిన అనసూయ.. ‘అయ్యో లేదమ్మా.. నన్ను అనసూయ అంటారు’ అని జవాబు ఇచ్చింది. అనంతరం సదరు నెటిజన్‌.. ‘క్షమించండి మేడమ్‌.. ఆట పట్టించడం(Kidding) కోసం నేను సరదాగా అన్నాను.’ అని రిప్లై ఇవ్వగానే.. ‘నాకర్థమైంది నువ్వు(మానసికంగా, బుద్ధిపరంగా అర్థం వచ్చేలా) చిన్నపిల్లాడివేనని(‘KID’DING). త్వరలోనే నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నా.’ అని కౌంటర్‌ ఇచ్చారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని