close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ-కర్ణాటక బస్సు సర్వీసులు నిలిపివేత

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. బెంగళూరులో లాక్‌డౌన్‌ దృష్ట్యా ఈ నెల 15 నుంచి 23 వరకు బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. దీంతో రేపు రాత్రి నుంచి కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బస్సులు నడుపుతామని ఈడీ తెలిపారు. టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని