‘ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి’
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 21:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి’

ఏపీ ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను

దిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను కోరారు. ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనను భాజపా, జనసేన ఖండించాలని డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. అనేక మంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడిందని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలని సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని.. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వమన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష కూటమిని ఏర్పాటు చేసి ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు వైకాపాతో కలిసి రావాలని సూచించారు. ఒడిశాలో ఉన్న గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయిస్తే రెండేళ్లలో లాభాల బాట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని