AP Corona: 2 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Corona: 2 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరోసారి 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 96,446 శాంపిల్స్‌ పరీక్షించగా 22,399 మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో బాధపడుతూ 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 9,077కి చేరింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 13,66,785 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,77,02,133 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక 18,638 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, మొత్తం 11,56,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో విశాఖపట్నంలో 11 మంది, విజయనగరంలో 11 మంది, చిత్తూరులో తొమ్మిది మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, కృష్ణలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు కరోనాతో మరణించారు. 

జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని