close

తాజా వార్తలు

Published : 06/07/2020 22:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘‘చట్టాలు మారుస్తాం.. కొత్త చట్టాలూ తెస్తాం’’

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అమరావతి: భవిష్యత్తులో తీసుకునే చర్యలకు హైపవర్‌ కమిటీ నివేదిక మార్గదర్శకం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీపై హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సీఎం జగన్‌ మాట్లాడారు. పరిశ్రమల భద్రత, ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

‘‘అవసరమైతే చట్టాలు మారుస్తాం. కొత్త చట్టాలు తెస్తాం. నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలిస్తాం. పరిశ్రమలను గ్రీన్‌, వైట్‌ కేటగిరీగా మార్చుకోవాలని ఆదేశిస్తాం. పరిశ్రమలకు సంబంధించిన శాఖలన్నీ మరింత పటిష్ఠంగా పని చేయాలి. పటిష్ఠ కార్యాచరణ, ప్రణాళిక, ప్రోటాకాల్‌ సిద్ధం చేసుకోవాలి. హైపవర్‌ కమిటీ నివేదిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని