జపాన్‌లో మరో కొత్త రకం కరోనా

తాజా వార్తలు

Published : 20/02/2021 00:33 IST

జపాన్‌లో మరో కొత్త రకం కరోనా

టోక్యో: తమ దేశంలో మరో కొత్త కరోనా వైరస్‌ రకాన్ని గుర్తించినట్లు జపాన్‌ నేడు ప్రకటించింది. తూర్పు జపాన్‌లోని కాంటే ప్రాంతంలో 91 కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసుల్లో ఈ కొత్త రకం మహమ్మారిని కనుగొన్నట్టు తెలిపింది. దీనితో టోక్యో ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఓ ఇన్ఫెక్షన్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. జపాన్‌లో అప్పుడప్పుడు వెల్లడైన ఇతర కొవిడ్‌ రకాల కంటే ఇది విభిన్నంగా ఉందని.. కనుక ఇది వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉంటుందని ఇక్కడి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ వెల్లడించింది. వ్యాక్సిన్‌ పనితీరును దెబ్బతీసే E484K మ్యుటేషన్‌ను, ఈ కొత్త రకం కరోనా వైరస్‌లో కూడా కనుగొన్నామని శాస్త్రజ్ఞులు తెలిపారు.

ఇప్పటివరకు వెల్లడైన రకాల కంటే కూడా ఈ కొత్త వైరస్‌ మరింత త్వరగా వ్యాపించవచ్చని.. తద్వారా దేశంలో కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశముందని కూడా అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా పరివర్తన చెందిన ఈ కొవిడ్‌ వైరస్‌ కూడా వ్యాక్సిన్లకు లొంగకపోయే అవకాశమున్నందున జపాన్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. ఆ దేశంలో ఈ వారం టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని