అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె
close

తాజా వార్తలు

Published : 22/09/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయం, ఏపీసీఆర్‌డీఏ రద్దు అంశం, అసైన్డ్‌ రైతులను తీవ్రంగా నష్టపరిచే జీవో 41 రద్దు అంశాలు అమరావతి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి తరలి పోతుందని ఆందోళన చెంది కొందరు రైతులు మృత్యు ఒడికి చేరుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూమి ఇచ్చిన మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పారా సదాశివరావు(59) ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి సదాశివరావు రెండు ఎకరాల 25 సెంట్ల భూమిని ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో రాజధాని అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తరచూ ఆలోచిస్తూ ఆందోళన చెందేవారని కుటుంబసభ్యులు తెలిపారు.   

మరోవైపు రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 280 రోజులుగా రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలంటూ 29గ్రామాల్లోని రైతులు రోజుకో రూపంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారికి పొంగళ్లు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మనసు మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వేడుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని