close

తాజా వార్తలు

Updated : 27/01/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్‌ : అనుష్క

హైదరాబాద్‌ : మహిళల భద్రతకు పెద్దపీట వేశామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జీఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ‘షీ పాహి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలు, షీ షటిల్‌ సర్వీసులను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా షీటీమ్స్‌ తరహా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సజ్జనార్‌ వివరించారు. ట్రాఫిక్‌, సైబర్‌ క్రైమ్‌ సహా అన్ని విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్‌ అని కొనియాడారు. కొవిడ్‌ సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు. తెలంగాణలో ఇంత మంది మహిళా పోలీసులు ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, షీ టీమ్స్‌ డీసీసీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..
బంగారు తెలంగాణకు పటిష్ఠ పునాదులు

దుష్ప్రచారం.. వైరస్‌ కన్నా ప్రమాదకరం





Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని