close

తాజా వార్తలు

Published : 22/07/2020 19:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

11 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు అనుష్క బ్లాక్‌బస్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిట్‌ సినిమా ఎక్కడున్నా కొనేసి తీసుకెళ్లిపోతున్నారు నిర్మాతలు. అది టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ అయినా... ఇంకే వుడ్‌ అయినా. ఇప్పుడు అలాంటిదే మరో వార్త... అయితే అది 11 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాది కావడం గమనార్హం. రీసెంట్‌ ట్రెండ్‌కు తగ్గట్టే ఆ సినిమా కూడా మన వుడ్‌ నుంచి బాలీవుడ్‌కే వెళ్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే... అనుష్క కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ ‘అరుంధతి’. అవును... పశుపతిని సంహరించిన ‘అరుంధతి’ బాలీవుడ్‌కి వెళ్తోంది. 

‘అరుంధతి’ బాలీవుడ్‌కి తీసుకెళ్లడానికి చాలా ఏళ్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పడు ఆ అవకాశం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి దక్కిందని తెలుస్తోంది. శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి నుంచి ఈ సినిమా రీమేక్‌ హక్కులు కొన్నఅరవింద్‌, మరో నిర్మాత మధు మంతెనతో కలసి బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తారని తెలుస్తోంది. అనుష్క పాత్ర కోసం ప్రముఖ కథానాయిక దీపిక పదుకొణెను సంప్రదించారని భోగట్టా. అయితే ఈ రీమేక్‌ విషయంలో అల్లు అరవింద్‌ టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అనుష్క కెరీర్‌ని మలుపుతిప్పిన సినిమా ‘అరుంధతి’. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నటనకు గాను అనుష్కకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం కూడా దక్కింది.  అనుష్క నటన, కథ-కథనం, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సోనూ సూద్‌ పాత్ర మలచిన తీరు, కోడి రామకృష్ణ మాయాజాలం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.