గుండెపోటుతో ఇద్దరు రాజధాని రైతుల మృతి
close

తాజా వార్తలు

Updated : 21/12/2020 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుండెపోటుతో ఇద్దరు రాజధాని రైతుల మృతి

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమంలో భాగమైన మరో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడ గ్రామానికి చెందిన పాతూరి హైమావతి(58), అదే మండలంలోని అనంతవరానికి చెందిన వీర రాఘవులు(65) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తెదేపా హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతి నిర్మాణానికి హైమావతి, వీరరాఘవులు తమకున్న భూమిని అందజేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో అమరావతి రైతులు ఉద్యమానికి దిగిన విషయం తెలిసిందే. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు ఏడాదికి పైగా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. కాగా తాజాగా మృతిచెందిన హైమావతి అమరావతి రాజధానికి ఎకరం భూమి ఇచ్చారు. వీరరాఘవులు తనకున్న 60 సెంట్లను తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి అందజేశారు. ఉద్యమ ప్రారంభం నుంచి అందులో చురుగ్గా పాల్గొనే ఈ ఇద్దరు  ఒక్కసారిగా మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి.. 
369వ రోజుకు చేరిన ఉద్యమం 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని