కర్నూలు ప్రమాదం: రూ.2లక్షల చొప్పున పరిహారం    
close

తాజా వార్తలు

Published : 14/02/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్నూలు ప్రమాదం: రూ.2లక్షల చొప్పున పరిహారం    


అమరావతి: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ పరిహారం కటించారు. మృతి చెందిన వారికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బాధితుల బంధువులు కర్నూలు ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్‌ మండలం కొండమారుపల్లె పంచాయతీ పరిధిలోని బాలాజీనగర్‌ వాసులు. 

ఇవీ చదవండి..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

ములకలూరులో వైకాపా శ్రేణుల రాళ్లదాడి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని