
తాజా వార్తలు
3 జిల్లాల్లో జగన్ ఏరియల్ సర్వే
తిరుపతి: నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతోంది. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్కు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం బయల్దేరారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగవీక్షణం ద్వారా పరిశీలించనున్నారు. పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
Tags :
జనరల్
జిల్లా వార్తలు