close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/05/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

90శాతం హామీలు అమలు చేశాం: జగన్‌

అమరావతి: ‘నవరత్నాల’ ద్వారానే పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,641 రైతు భరోసా కేంద్రాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏడాది పాలన ఎంతో నిబద్ధతతో సాగిందని, 90 శాతం హమీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని తెలిపారు. ఇచ్చిన మాటను, ప్రమాణాలను ఏడాదికాలంగా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు 129 కాగా.. అమలు చేసినవి 77 ఉన్నాయని వివరించారు. అమలు కోసం మరో 35 హామీలు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పకుండా అమలు చేసినవి మరో 40 వరకూ ఉన్నాయని వివరించారు.

‘‘ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అవినీతికి తావులేకుండా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. పింఛన్లకు రూ.1500 కోట్లు ఖర్చవుతోంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచినవన్నీ పూర్తి చేస్తూ వస్తున్నాం. రాష్ట్రంలోని కోటి 78లక్షల వెనుకబడిన వర్గాలకు  రూ.19,309 కోట్లు ఖర్చు చేశాం. గిరిజనుల సంక్షేమానికి రూ.2,136 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పేదలకు రూ.1722 కోట్లు ఖర్చు చేశాం. ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పైసా లంచం ఇవ్వకుండా, వివక్షకు తావులేకుండా చేస్తున్నాం. పింఛను, రేషన్‌ కార్డు వంటి ఏ పనైనా సులభంగా జరిగేలా ఏర్పాటు చేశాం. 540 రకాల సేవలతో గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామంలో ఏది కావాలన్నా లంచం లేకుండా పనులు చేసుకోవచ్చు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తపిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేల జబ్బులను తీసుకొచ్చి..పైలట్‌ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నాం ’’ అని సీఎం వివరించారు.

 గత ప్రభుత్వం 650 పైచిలుకు వాగ్దానాలు చేసి పది శాతం కూడా అమలు చేయలేదని జగన్‌ విమర్శించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ఆలోచిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇక్కడే చూస్తున్నాం. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేద్దామన్నా అడ్డుకుంటున్నారు’’ అని సీఎం విమర్శించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.