వాలంటీర్లు నిస్వార్థంగా పని చేస్తున్నారు: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 12/04/2021 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాలంటీర్లు నిస్వార్థంగా పని చేస్తున్నారు: జగన్‌

పెనమలూరు: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పని చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రశంసించారు. వైకాపా ప్రభుత్వం  ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా ఉత్తమ సేవలందించిన వారిని సత్కరించే కార్యక్రమానికి జగన్‌ ఇవాళ శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను సీఎం అందజేశారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వ పథకాలకు రాష్ట్రంలో గ్రామగ్రామాన వాలంటీర్లు సంధానకర్తలుగా ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాలంటీర్లలో 53 శాతం మంది మహిళలే ఉన్నారు. దాదాపు 20 నెలల క్రితం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. వాలంటీర్ల తర్వాత సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం. వాలంటీర్లు విమర్శలకు బెదరకుండా పని చేయాలి. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవార్డు ప్రదాన కార్యక్రమం చేపడుతున్నాం’’ అని అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని