close

తాజా వార్తలు

Updated : 05/03/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ ను ప్రారంభించిన జగన్‌

అమరావతి: మీడియా, సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తోన్న ప్రచారాన్ని ఖండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ ’ వేదికను ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ ’ వెబ్‌సైట్‌, ట్విటర్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా  ‘ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌’ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందని సీఎం తెలిపారు. దుష్ప్రచారం ఎలా తప్పో ఆధారాలతో సహా చూపించడమే ఫ్యాక్ట్‌ చెక్‌ ఉద్దేశమన్నారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని సీఎం అన్నారు. దురుద్దేశ పూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని