
తాజా వార్తలు
ఏపీలో కరోనా.. కొత్తగా 161 కేసులు
అమరావతి: ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 36,091 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,85,985కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,140కి చేరింది. 24 గంటల వ్యవధిలో 251 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,25,76,272 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..
ఇవీ చదవండి..
కరీంనగర్ జిల్లాలో గుప్తనిధుల కలకలం
Tags :