
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 27,861 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,141కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 263 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,04,214 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..
ఇవీ చదవండి..
నెల్లూరు ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు
రేపు దిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
Tags :