close

తాజా వార్తలు

Published : 22/01/2021 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 48,313 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,146కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 167 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,488 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,27,87,961 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. 

జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..

ఇవీ చదవండి..

ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్‌ 

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని