close

తాజా వార్తలు

Updated : 12/04/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కరోనా.. 3,263 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 33,755 నమూనాలను పరీక్షించగా 3,263 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,28,664కి చేరింది. వీరిలో 8,98,238 మంది కోలుకున్నారు.

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు.. అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,311కి చేరింది. ఒక్కరోజులో 1,091 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 23,115 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,63,146 నమూనాలను పరీక్షించారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

 

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని