close

తాజా వార్తలు

Published : 26/01/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్‌ అత్యవసర భేటీ

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎన్నికల విధులు, ఓట్లర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, నామినేషన్ల ఏర్పాట్లపై సీఎస్‌ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తొలి దశ ఎన్నికలకు సిద్ధంకాకపోవడంతో కొత్త షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది. కొత్త షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9న తొలిదశ, 13న రెండో దశ, 17న మూడో దశ, 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 29న  ప్రారంభమవుతుంది. 13న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, 17న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 6 నుంచి, 21న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇవీ చదవండి..

ఎన్నికలు పెట్టాల్సిందే

ఎన్నికలు, కరోనా టీకాలూ ఒకేసారి సాధ్యం కాదు



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని